
ప్రతీ నెలా శుధ్ధ ఏకాదశి శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్లో గాయత్రీ హోమం జరుగును.
గాయత్రి మంత్రం ప్రాశస్త్యం: ఋషులు, యోగులు, మునులు, సామాన్యులు, పాపభూయిష్టమైన ఈ ప్రాపంచికము నుండి ముక్తులయి, శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుటకు అనేక విధములయైన ప్రయత్నములు చేయుచున్నారు. ఆ బ్రహ్మపదమును అనుగ్రహించు విద్య :గాయత్రీ మహావిద్య”
” న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా ”
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.
సమస్త పూజా కార్యక్రమములు తక్కువ ఖర్చులోనే !
గృహప్రవేశ, ఉపనయయము, వ్రతాలు, నిశ్చితార్థము, అన్ని పెళ్ళి కార్యక్రమాలు, మహన్యాస రుద్రాభిషేకం, నామకరణ, అన్నప్రాసన, నవగ్రహ నక్షత్ర శాంతులు, హోమాలు ఉంటే మాకు తెలియచేయగలరు. శాస్త్రోక్తంగా మీ కుటుంబ ఆచారవ్యవహారాలకు సాంప్రదాయాలకనుగుణంగా పూజ చేయించగలము. అన్ని బాషలలో తమ అనుకూలతల మేరకు సంభాషించి దిగ్విజయముగా వైదిక క్రతువులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యవాస్తు శాస్త్రజ్ఞులు, మంత్ర, తంత్ర శాస్త్ర ప్రావీణ్యులు బ్రహ్మశ్రీ చిలుకూరి శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో నిర్వహించగలము.
ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్నప్రాద సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును.
కావున సదరు పై విషయములను మీకు తెలిసిన వారందరికీ పంపించి భక్తులు మనసా, వాచా, కర్మణ ధన, వస్తు రూపేణ సహకరించి సంస్థ అభివృద్ధికి మీ సహాయ సహకారములు అందించగలరని మా విన్నపం.
ముఖ్యగమనిక : ఈ సంస్థ ఆదాయపు పన్నుశాఖలో సెక్షన్ 80 జి క్రింద నమోదు అయి పన్నుమినహాయింపును కలిగి ఉన్నది.
