Sarvana Lakshmi Pooja Homam
SLGV Foundation >> Uncategorized>> Sarvana Lakshmi Pooja HomamSarvana Lakshmi Pooja Homam

శ్రావణ శుద్ధ పాడ్యమి నుండి 25.07.2025 నుండి 23.08.2025 వరకు శ్రావణ మాస ఉత్సవములు వైభవోపేతంగా జరుపుటకు నిశ్చయించడం అయినది.
ఒక్క రోజుకు 36 జంటలకు మాత్రమే స్వయంగా పాల్గొనే అవకాశం.
కావున ఆస్తిక మహాశయులు తమ యొక్క గోత్రనామములను తగిన రుసుము చెల్లించి కార్యక్రమంలో పాల్గొని సకల శత్రు బాధలను, ఆర్థిక బాధలను, న్యాయ చిక్కులను పరిష్కరించుకుని ఆ జగన్మాత అయిన దేవి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు.
నిత్యము పంచభక్ష ప్రసాదములకు, ఇతర నైవేద్యాధి ద్రవ్యములకు, పూలదండలు, బియ్యము, ఆవునెయ్యి, కూరగాయలు, లైటింగ్,నాదస్వరం, పూల అలంకరణ, పూలమాలలు, పట్టువస్త్రములు,పూజా ద్రవ్యములు, ప్రసాద వితరణకు, మౌళిక వసతులు గురించి దాతలు సహకరించేవారు ద్రవ్య రూపంలో తమ శక్తి కొలది వస్తు రూపంలో, ధన రూపంలో సహాయ సహకారాలు అందించగలరు.
అమ్మవారి సేవలు
ప్రతిరోజు ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో, కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, విశేష ద్రవ్యాలతో మూల మంత్ర హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ. అభిషేక అర్చనలకు.
