నవరాత్రి శుక్ల పక్ష నవమి నాడు ప్రారంభమవుతుంది. మాఘ మాస శుక్ల నవమి వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఇది 2027 జనవరి 22న ప్రారంభమవుతుంది. మాఘ శుక్ల నవమి జనవరి 30 ఈ 9 రోజుల పాటు శ్రీ శ్యామలాదేవిని ఆరాధించడం వలన విద్య, బుద్ధి, వ్యాపార అభివృద్ధి, జ్ఞానం మరియు మనశ్శాంతి లభిస్తాయి.

ఇవే నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ రోజు పూజను ఎలా చేయాలి? ఆచారాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం నాలుగు నవరాత్రులు ఉంటాయి : మాఘ మాసంలో శ్యామ నవరాత్రులు.

ఆశ్వయుజ మాసంలో దుర్గానవరాత్రులు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు. చైత్ర మాసంలో లలితా నవరాత్రులు (మహా నవరాత్రులు అని కూడా అంటారు). ప్రతి సంవత్సరం చైత్ర మరియు ఆశ్వయుజ మాసాలలో జరిగే నవరాత్రులు ప్రసిద్ధమైనవి. మిగిలిన రెండు నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. దక్షిణ భారతదేశంలో ఈ పర్వదినాన్ని మహా శివరాత్రిగా కూడా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరికీ విస్తృతంగా తెలియవు.

నవరాత్రి సమయంలో శ్రీ శ్యామలాదేవిని ఆరాధించడం వలన ఉద్యోగం, వ్యాపారంలో ఐశ్వర్యం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. బంధాసురుడిని సంహరించేందుకు ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా అవతరించి, బ్రహ్మాది దేవతలను పునఃసృష్టించుటకు శ్యామలాదేవిని సృష్టించి, షోడశ మంత్రిణుల్లో ప్రధానమంత్రిగా నియమించింది. అందుకే శ్యామలాదేవిని మంత్రిణీదేవి అని కూడా అంటారు. దశమహావిద్యల్లో ఆమెను మాతంగి అని పిలుస్తారు.

ఉత్సవం మొదటి రోజు శైలపుత్రి రూపంలో, రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో, మూడవ రోజు చంద్రఘంట రూపంలో, నాల్గవ రోజు కూష్మాండ రూపంలో, ఐదవ రోజు సరస్వతి రూపంలో, ఆరవ రోజు వశ్య రూపంలో, ఏడవ రోజు సారికా రూపంలో, ఎనిమిదవ రోజు శైలపుత్రి రూపంలో, తొమ్మిదవ రోజు రాజమాత రూపంలో ఆరాధిస్తారు. ప్రతిరోజు శ్యామలాదేవికి కుంకుమార్చన చేసి మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మాతంగి స్తోత్రాలు, క్రీడా కవచం, సహస్రనామం మొదలైనవి పారాయణం చేస్తారు.

దాన వివరాలు: బాదం (5 కిలోలు), కిస్మిస్ (5 కిలోలు), జీడిపప్పు (5 కిలోలు),
అన్నప్రసాదం (రోజుకు భోజన వితరణ) – ₹50,000
పూలమాలలు, పుష్పాలు – రోజుకు ₹5,000
తామర పూలు, తమలపాకులు – రోజుకు ₹1,500
నెయ్యి (10 కిలోలు)
ఇతర దాన వివరాలు కోరిన వారికి అందుబాటులో ఉంటాయి. మీరు పై వస్తువులను స్వయంగా అందించవచ్చు లేదా నగదు రూపంలో దానం చేయవచ్చు. మీ భాగస్వామ్యం ఈ ఉత్సవాల పవిత్రతను పెంచుతుంది. మీ ఉదార సహకారానికి మా కృతజ్ఞతలు.

సమస్త పూజా కార్యక్రమములు తక్కువ ఖర్చులోనే !
గృహప్రవేశ, ఉపనయయము, వ్రతాలు, నిశ్చితార్థము, అన్ని పెళ్ళి కార్యక్రమాలు, మహన్యాస రుద్రాభిషేకం, నామకరణ, అన్నప్రాసన, నవగ్రహ నక్షత్ర శాంతులు, హోమాలు ఉంటే మాకు తెలియచేయగలరు. శాస్త్రోక్తంగా మీ కుటుంబ ఆచారవ్యవహారాలకు సాంప్రదాయాలకనుగుణంగా పూజ చేయించగలము. అన్ని బాషలలో తమ అనుకూలతల మేరకు సంభాషించి దిగ్విజయముగా వైదిక క్రతువులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యవాస్తు శాస్త్రజ్ఞులు, మంత్ర, తంత్ర శాస్త్ర ప్రావీణ్యులు బ్రహ్మశ్రీ చిలుకూరి శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో నిర్వహించగలము.

ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్నప్రాద సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును.
కావున సదరు పై విషయములను మీకు తెలిసిన వారందరికీ పంపించి భక్తులు మనసా, వాచా, కర్మణ ధన, వస్తు రూపేణ సహకరించి సంస్థ అభివృద్ధికి మీ సహాయ సహకారములు అందించగలరని మా విన్నపం.
ముఖ్యగమనిక : ఈ సంస్థ ఆదాయపు పన్నుశాఖలో సెక్షన్ 80 జి క్రింద నమోదు అయి పన్నుమినహాయింపును కలిగి ఉన్నది.

కాబట్టి మీకు తెలిసిన వారందరికీ తెలియజేసి సహకరించే అవకాశం కల్పించగలరని మనవి.