Vaarahi Guptha Navaratri
₹5,116.00
ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.27 జన్మనక్షత్రముల వారికి వారాహి హోమం జరుగును.
26-06-2025 ఆషాఢ శుద్ధ పాడ్యమి పునర్వసు నక్షత్రం నుండి 04-07-2025 అషాఢ శుద్ధ నవమి చిత్త నక్షత్రం వరకు 05-07-2025 పూర్ణాహుతి సమర్పించే అవకాశం స్వయంగా పాల్గొని వారాహి హోమంలో హొమ ద్రవ్యాలు, ఆహుతులు, ప్రతినిత్యం ఉదయం 8:30 గంటలకు జరుగును.
26.06.25 – ఆరుద్ర, స్వాతి, శతభిషా
27.06.25 – పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
28.06.25 – పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర
29.06.25 – అశ్లేష, జ్యేష్ఠ, రేవతి
30.06.25 – అశ్విని, మఖ, మూల
01.07.25 – భరణి, పుబ్బ, పూర్వాషాఢ
02.07.25 – కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ
03.07.25 – రోహిణి, హస్త, శ్రవణం
04.07.25 – మృగశిర, చిత్త, ధనిష్ట
05-07-2025 ప్రత్యేక పూర్ణాహుతి. హోమంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా పురుషులు పంచ,కండువా స్త్రీలు సంప్రదాయ వస్త్రాలు ధరించి హోమానికి రావాలి. హోమ సమయానికి ఖచ్చితంగా రావాలి. పరోక్షంగా మీ గోత్రనామాలు తెలియచేసి పాల్గొనవచ్చు. కావున ఆస్తిక మహాశయులు తమ యొక్క గోత్రనామములను తగిన రుసుము చెల్లించి కార్యక్రమంలో పాల్గొని సకల శత్రు బాధలను, ఆర్థిక బాధలను, న్యాయ చిక్కులను పరిష్కరించుకుని ఆ జగన్మాత అయిన వారాహి దేవి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు.
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిచ పార్వతి “అన్ని దానాలలోకి అన్నదానం మిన్న” బియ్యము, పప్పు,నూనె,చింతపండు, కూరగాయలు తమకు తోచిన విధంగా సహకరించవచ్చు. మా కార్యాలయం నందు అందచేయగలరు.
నిత్యము పంచభక్ష ప్రసాదములకు, ఇతర నైవేద్యాధి ద్రవ్యములకు, పూలదండలు, బియ్యము, ఆవునెయ్యి, కూరగాయలు, లైటింగ్,నాదస్వరం, పూల అలంకరణ, పూలమాలలు, పట్టువస్త్రములు,పూజా ద్రవ్యములు, ప్రసాద వితరణకు, మౌళిక వసతులు గురించి దాతలు సహకరించేవారు ద్రవ్య రూపంలో తమ శక్తి కొలది వస్తు రూపంలో, ధన రూపంలో సహాయ సహకారాలు అందించగలరు.
In Stock
Recent Views
Maha Mruthyunjaya Pasupatha
₹3,000.00Raja Syamala Devi
₹10,116.00
Description
సంవత్సరంలో మొత్తం నాలుగు నవరాత్రులు
1. వసంత ఋతువు లలితా నవరాత్రులు 2. ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులు 3. ఆశ్వయుజం దేవీ నవరాత్రులు 4. మాఘమాసం శ్యామలా నవరాత్రులు.
ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు. ఆషాఢ శుక్ల ప్రతిపత్ నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ దేవిని పూజిస్తారు. నాలుగు ప్రధాన నవరాత్రులలో వారాహి నవరాత్రులు ఒకటి. ఆషాడ శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు (2025 జూన్ 26న ప్రారంభమై జూలై ౦5 వరకు) ఆషాఢ గుప్త వారాహి నవరాత్రి మహోత్సవములు.
27 జన్మనక్షత్రముల వారికి వారాహి హోమం జరుగును.
26-06-2025 ఆషాఢ శుద్ధ పాడ్యమి పునర్వసు నక్షత్రం నుండి 04-07-2025 అషాఢ శుద్ధ నవమి చిత్త నక్షత్రం వరకు 05-07-2025 పూర్ణాహుతి సమర్పించే అవకాశం స్వయంగా పాల్గొని వారాహి హోమంలో హొమ ద్రవ్యాలు, ఆహుతులు, ప్రతినిత్యం ఉదయం 8:30 గంటలకు జరుగును.
26.06.25 – ఆరుద్ర, స్వాతి, శతభిషా
27.06.25 – పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
28.06.25 – పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర
29.06.25 – అశ్లేష, జ్యేష్ఠ, రేవతి
30.06.25 – అశ్విని, మఖ, మూల
01.07.25 – భరణి, పుబ్బ, పూర్వాషాఢ
02.07.25 – కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ
03.07.25 – రోహిణి, హస్త, శ్రవణం
04.07.25 – మృగశిర, చిత్త, ధనిష్ట
05-07-2025 ప్రత్యేక పూర్ణాహుతి. హోమంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా పురుషులు పంచ,కండువా స్త్రీలు సంప్రదాయ వస్త్రాలు ధరించి హోమానికి రావాలి. హోమ సమయానికి ఖచ్చితంగా రావాలి. పరోక్షంగా మీ గోత్రనామాలు తెలియచేసి పాల్గొనవచ్చు. కావున ఆస్తిక మహాశయులు తమ యొక్క గోత్రనామములను తగిన రుసుము చెల్లించి కార్యక్రమంలో పాల్గొని సకల శత్రు బాధలను, ఆర్థిక బాధలను, న్యాయ చిక్కులను పరిష్కరించుకుని ఆ జగన్మాత అయిన వారాహి దేవి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు.
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిచ పార్వతి “అన్ని దానాలలోకి అన్నదానం మిన్న” బియ్యము, పప్పు,నూనె,చింతపండు, కూరగాయలు తమకు తోచిన విధంగా సహకరించవచ్చు. మా కార్యాలయం నందు అందచేయగలరు.
నిత్యము పంచభక్ష ప్రసాదములకు, ఇతర నైవేద్యాధి ద్రవ్యములకు, పూలదండలు, బియ్యము, ఆవునెయ్యి, కూరగాయలు, లైటింగ్,నాదస్వరం, పూల అలంకరణ, పూలమాలలు, పట్టువస్త్రములు,పూజా ద్రవ్యములు, ప్రసాద వితరణకు, మౌళిక వసతులు గురించి దాతలు సహకరించేవారు ద్రవ్య రూపంలో తమ శక్తి కొలది వస్తు రూపంలో, ధన రూపంలో సహాయ సహకారాలు అందించగలరు.
ప్రతి నిత్యం అమ్మవారి సేవలు
ప్రతిరోజు ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో, వారాహి కవచం,ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, విశేష ద్రవ్యాలతో మూల మంత్ర హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము,
తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ.
1 వ రోజు పాడ్యమి ఉన్మత్త వారాహి (ఇంద్రాణి)
26-06-2025 ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో, వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా.05:00 గంటలకు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచన, నాంది, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అంకురారోపణము, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధన, చతుషష్టి యోగిని మండప ఆరాధన, వాస్తు మండప ఆరాధన, క్షేత్రపాలక మండప ఆరాధన, నవగ్రహ మండప ఆరాధన, సర్వతో భద్ర మండప సహిత బ్రహ్మ కలశ స్థాపన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి దుర్గాంబిక (వారాహి) ప్రధాన దేవత మండప ఆరాధన, సహస్రనామ అర్చన, అగ్ని మదనము, అగ్ని ప్రతిష్టాపన, గణపతి నవగ్రహ వారాహి హోమము, మంగళహారతి, మంత్రపుష్పము తీర్థ ప్రసాద వినియోగము, ఊంజల్ సేవ, మహా ప్రసాద వినియోగం జరుపబడును.
2 వ రోజు విదియ – బృహత్ వారాహి (బ్రాహ్మిస్వరూప వారాహి)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో,వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ,
సహస్రనామార్చన, విశేష ద్రవ్యాలతో వారాహీ మూల మంత్ర సహిత నవగ్రహ రుద్ర హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ.
3 వ రోజు తదియ – స్వప్నవారాహీ (మహేశ్వరి)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో,వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, విశేష ద్రవ్యాలతో వారాహీ మూల మంత్ర సహిత నవగ్రహ బాలాత్రిపుర సుందరి హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ.
4 వ రోజు చవితి – కిరాతవారాహి (కౌమారి)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో,వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన,
విశేష ద్రవ్యాలతో వారాహీ మూల మంత్ర సహిత రాజశ్యామలా, నవగ్రహ హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ.
5 వ రోజు పంచమి – శ్వేత వారాహి (వైష్ణవి)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో, వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, విశేష ద్రవ్యాలతో వారాహీ మూల మంత్ర సహిత సిద్ద లక్ష్మీ, నవగ్రహ హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ.
6 వ రోజు షష్ఠి – ధూమ్రవారాహి (శాకాంబరీ దేవి)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో, వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, కుంకుమార్చన, విశేష ద్రవ్యాలతో వారాహీ, లక్ష్మీ సూక్త, తామరగింజలతో లక్ష్మీ మూల మంత్ర సహిత నవగ్రహ హోమములు,నైవేద్యము,మంత్రపుష్పము, తీర్థ,మహా ప్రసాద వినియోగము.ఊంజల్ సేవ.
7వ రోజు సప్తమి – మహావారాహి (చంఢీ)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో,వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, కుంకుమార్చన, విశేష ద్రవ్యాలతో వారాహీ, చంఢీ హోమము, మూల మంత్ర సహిత నవగ్రహ హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ.
8 వ రోజు అష్టమి – వార్తాళీ వారాహి (వారాహీ పరమేశ్వరి)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో, వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, కుంకుమార్చన, విశేష ద్రవ్యాలతో వారాహీ మూల మంత్ర సహిత, వారాహి కవచ, దక్షిణ కాళీ మూల మంత్ర, నవగ్రహ హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహా ప్రసాద వినియోగము. ఊంజల్ సేవ.
9 వ రోజు నవమి – దండిని వారాహి (లలితా పరమేశ్వరి)
ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో, వారాహి కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన, కుంకుమార్చన, విశేష ద్రవ్యాలతో వారాహీ, దుర్గా మూల మంత్ర మన్యుసూక్త ప్రధాన మండప దేవతా సహిత నవగ్రహ హోమములు, క్షేత్రపాలక కూష్మాండ బలి, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, సంప్రోక్షణ, నైవేద్యము, మంత్రపుష్పము, మహా ఆశీర్వచనము, తీర్థ, మహా ప్రసాద వినియోగము జరుగుతుంది.
#రాత్రివేళల్లో_పూజలందుకునే_వారాహి_దేవత. దశమి – ఆది వారాహి మహపూజ మరియు ఉద్యాపన
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |
వారాహి ఆరాధన వల్ల తల్లి ఎన్నో సమస్యలను పరిహారం చేస్తుంది. ముఖ్యంగా రాజకీయ, పారిశ్రామిక, రియల్ ఎస్జేట్ వ్యాపార రంగాల వారికి, ఆస్తి తగాదాలు హక్కులు అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడం, శత్రు బాధలు, గ్రహ బాధలు, ప్రయోగ బాధలు నుండి విముక్తి కలుగుతుంది. భూ సంబంధ తగాదాలు ఉన్నవారికి, మానసికంగా కుంగిపోయిన వాళ్లకి ఈ యొక్క దేవత ఆరాధన వల్ల స్వాంతన లభిస్తుంది.
వారాహి అమ్మ వారి అవతారాలు – అమ్మవారి వైభవం గురించి కొంత తెలుసుకుందాం..
వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్ | హారాగ్రైవేయతుంగస్తనభరనమితాం పీతకైశేయవస్త్రామ్ ||
దేవీం దక్షోధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలమ్ | వామాభ్యాం ధారయన్తీం కువలయకలితాం శ్యామలాం సుప్రసన్నామ్ ||
1.బృహత్వారాహి 2.స్వప్నవారాహి 3.కిరాతవారాహి 4.లఘువారాహి 5.ధూమ్రవారాహి 6.మహావారాహి గా చెప్పబడుతున్నది.
వారాహి దేవి అంటే ఎవరు? ఇది తంత్రశాస్త్రంలోనిది వరాహ స్వామి కంటే ముందు ఉన్న శక్తి. లలితా పరమేశ్వరికి సర్వ సైన్యాధ్యక్షురాలు. శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రులలో అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది ఈ కుంకుమను భద్రంగా ప్రతిరోజు ధరించడం వల్ల జయము విజయము మీ వెంట ఉంటాయి.
వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని నీటిలోకి తీసుకెళ్లినప్పుడు, విష్ణువు వరాహ రూపంలో అవతరించి, అతన్ని చంపి భూదేవిని రక్షించాడు. స్వామి మీద భక్తితో అమ్మ వారాహి రూపాన్ని ధరించిందని, అందుకే ఆమె స్త్రీ వరాహస్వామి,శ్రీ మహాలక్ష్మీ.. అని కొన్ని ధ్యానశ్లోకాలలో కనిపిస్తుంది.అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణీ ధ్రువుడుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి కోరికలు అన్న నెరవేరుతాయి. వివాదాలను నిరోధిస్తుంది లేదా పరిష్కరిస్తుంది..
వారాహి మాత రూపాన్ని మనం గమనిస్తే, ఆమె మనకు వరాహ ముఖం, ఎనిమిది భుజాలు, శంఖం, చక్రం, హాల(నాగలి), ముసల(పాత్ర), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో దర్శనమిస్తుంది. రాజేశ్వారాహి స్వరూప కామాక్షి అమ్మవారిని ప్రార్ధించటానికి.. మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు.. లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.
లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు.ఆమెకు ప్రత్యేక రథం ఉంది,దానిపేరు కిరి చక్రం.ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.
వారాహీ అమ్మవారు అంటే భూదేవి.హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి,వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు.స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూ తగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది… నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు…దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు…ఈ తల్లి ప్రాణ సంరక్షిణి….ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం,లోభం,మోహం,మదం,మాత్సర్యం,అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు, అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి…బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి…ముఖ్య ప్రాణ రక్షిణి… దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం..
ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ…..
సర్వం శ్రీవారాహి(దండిని) చరణారవిందార్పణమస్తు.

Reviews
There are no reviews yet.