Subtotal: ₹16,116.00
You have 2 items in your cartSri Prathyangira Parameswari
₹10,116.00
జగద్గురువు శ్రీశ్రీశ్రీ కంచికామకోటి పీఠాధీశ్వురుల ఆశీర్వాదముచే గత కొన్ని సంవత్సరాలుగా
శ్రీలక్ష్మీగణపతి ఫౌండేషనులో అనేకమంది భక్తులు దర్శించుకొని శతృవు ఎటువంటి ప్రయోగం చేసినా దానిని నివారించటమే కాక, శతృవులనుండి పూర్తి రక్షణ కల్పిస్తుంది.
ప్రత్యంగిరా హోమం వల్ల సర్వ విధములైన దోషములు, నరదృష్ఠి, దుష్టగ్రహ ప్రయోగ బాధలు, ఆర్థిక, ఆరోగ్య బాధలు, అన్ని కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.
వివాహాన్ని, సంతానాన్ని, విద్యను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం, ప్రత్యక్ష నిదర్శనం.
In Stock
Description
ప్రత్యంగిరా అమ్మఅంటేనే ఓక అత్యంత శక్తివంతమైనదేవత శత్రు నాశనం సకల మనోబీష్ట సిద్దీ
రాజకీయ వ్యాపార అబివుద్ది సమస్త ప్రయోగాలనుండి కాపాడే తల్లి ఏకోరికైనా తీర్చగల తల్లిగురించి
నాలుగు మాటలు ప్రత్యంగిరాదెవ్యై నమో నమః లక్ష సింహ ముఖాలతో… భగభగమండే కేశాలతో… త్రినేత్రాలతో
అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి.
ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు. అంతటి అరుదైన ప్రత్యంగిరా ఆలయం మన రాష్ట్ర రాజధానిలోనే ఉంది.
శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి
అని పురాణప్రతీతి. కానీ ఉగ్రస్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరవయ్యారు.
ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో ‘కృత్య’గానూ దక్షిణాదిన కుంభకోణం (తమిళనాడు)లోని
అయ్యావరే అడవిలో నికుంభిలగానూ… ఇలా కొన్నిచోట్ల మాత్రమే పూజలందుకుంటోంది ఈ అమ్మవారు.
మానససరోవరం, కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణిని దర్శించి పూజాదికాలు
కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక, రౌద్ర అంశలుగా భావించే
కాళి, తార, చిన్నమస్తా, త్రిపుర భైరవి, భగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడశి(లలితాత్రిపురసుందరి), కమలాత్మిక (లక్ష్మీదేవి) అమ్మవార్లనూ ప్రతిష్ఠించారు.
శత్రుసంహారం, దారిద్య్రనివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర.
ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు.
సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు,
తెల్లఆవాలు, నల్లఉప్పు, శొంఠి, సమిదల వంటి రాజద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషేకాలూ హోమాలూ నిర్వహిస్తారు.
దుష్టశిక్షణార్థం…
సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట.
సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట. ఆ సంగతి తెల్సుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట.
ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట. దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట.
అప్పుడు ఆదిపరాశక్తి లక్షసింహముఖాలతో అతిభయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడినీ అతని సైన్యాన్నీ సంహరించిందట.
లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారనీ అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగాలేదనీ ఐతిహ్యం.
అధర్వణవేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అనీ శత్రువులకు వూపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అనీ… ఇలా ప్రత్యంగిరా దేవికి చాలా పేర్లున్నాయి.
ఇంద్రజిత్తు ఆరాధన…
ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు
తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని ‘నికుంభిల’ రూపాన పూజించి
ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి.
రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం వెుదలుపెట్టాడట.
అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతణ్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట.
దాంతో వానరులంతా వెళ్లి యాగమండపాన్నీ యజ్ఞాన్నీ ధ్వంసం చేశారట. సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు.
ఆరోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట.
ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని ‘చంద్రఘంట'(నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట.
ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. ప్రత్యక్షంగానే కాదు… పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందని నమ్మిక.
నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.
ప్రతి అమవాస్య రోజూన హోమం చేయ్యబడుతుంది
జగద్గురువు శ్రీశ్రీశ్రీ కంచికామకోటి పీఠాధీశ్వురుల ఆశీర్వాదముచే గత కొన్ని సంవత్సరాలుగా
శ్రీలక్ష్మీగణపతి ఫౌండేషనులో అనేక మంది భక్తులు దర్శించుకొని వందలాది హోమములు చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందారు.
శ్రీ ప్రత్యంగిరా సాధన అత్యంత ప్రాచీనమైనది. ఈ దేవత అధర్వణ వేదంలో చాలా శక్తివంతమైనదిగా వర్ణించబడినది.
శతృవు ఎటువంటి ప్రయోగం చేసినా దానిని నివారించటమే కాక, శతృవులనుండి పూర్తి రక్షణ కల్పిస్తుంది.
ప్రత్యంగిరా హోమం వల్ల సర్వ విధములైన దోషములు, నరదృష్ఠి, దుష్టగ్రహ ప్రయోగ బాధలు,
ఆర్థిక, ఆరోగ్య బాధలు, అన్ని కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.
వివాహాన్ని, సంతానాన్ని, విద్యను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం, ప్రత్యక్ష నిదర్శనం.
శ్రీ విష్ణుమాయ రాజరాజేశ్వరి పీఠం భక్తులకు తెలియచేయునది ఏమనగా లోక కళ్యాణార్దం
శ్రావణశుద్ధ పాడ్యమి అనగా ది.17.08.2023 నుండి
శ్రీలక్ష్మిగణపతి ఫౌండేషన్ వ్యవస్దాపకులు, గురుతుల్యులు, మహావిద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శాస్త్రజ్ఞులు డాక్టర్ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారి
పర్యవేక్షణలో లోకకళ్యాణార్దం శ్రీ విష్ణుమాయ రాజరాజేశ్వరి పీఠం నారపల్లి, ఘటకేసర్ మండలం, వరంగల్ హైవేలో సనాతన ధర్మం పాటిస్తూ,
ప్రజాక్షేమం కోరుతూ, ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఇబ్బందులు, ఆరోగ్యం, విద్య, వ్యాపారం, ఆలస్య వివాహం, ఉద్యోగ అసంతృప్తి,
భూ, గృహ సమస్యలు వంటివి దృష్టిలో పెట్టుకుని వాటినుండి ఉపశమనం పొందుటకు శ్రావణ శుద్ధపాడ్యమి
గురువారం 17-08-2023 నుండి (ఉదయం 8.00 గం. నుండి)“మహా నారాయణప్రత్యంగిరా యాగం” సహస్ర మంత్రజపం,
పారాయణ, 128 రోజులు కానీ 365 రోజులు కానీ తంత్రోక్త విధానంగా చేయాలని నిర్ణయించుకున్నారు.
అవకాశమును బట్టి నిత్యాన్నదానము, సహస్రనామ పారాయణ కూడా నిర్వహించాలని ప్రయత్నం.
ఈ బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా జరగాలని సర్వదా అందరికి జగన్మాత ఆశీస్సులతో శుభ ఫలితం పొందాలని ఆశిస్తూ..
దీనిలో పాల్గొనే ఔత్సాహికులు ఆందరూ అహ్వానితులే. ఈ హోమంలో పాల్గొనదలచిన వారు వారి గోత్రనామాలతో నిత్యము అనగా 128 రోజులు కూడా హోమసంకల్పం చెప్పించుకోదలచినవారు చెల్లించవలసిన
రుసుము 128 రోజులకు రూ.10,116/- రూపాయలు.
వివరాలకై సంప్రదించండి :
92463 69606 / 94400 54929
ప్రతిరోజు పీఠములో శ్రీ లక్ష్మీగణపతి, కాలభైరవ, బగళాముఖి, ప్రత్యంగిరా హోమాలు జరుగును.





Reviews
There are no reviews yet.