Subtotal: ₹13,116.00
You have 2 items in your cartMarriage Delay
₹2,000.00
పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలలో కొన్ని అంశాలు
కాబోయే భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఉంటారా ఉండరా అనే విషయం, విడిపోయేలా ఉంటే
పోలీస్ కేసులు కోర్టు గొడవలు భరణాలతో విడిపోతారా లేదా ఏ గొడవ లేకుండా విడిపోతారా
అనే విషయం కూడా తెలుస్తుంది. జాతకాల పరిశీలించినప్పుడు ఇది కచ్చితంగా తెలుస్తుంది.
సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా,
అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా వివాహం ఆలస్యం.
సప్తమాధిపతి రాహు, కేతు నక్షత్రాల్లో ఉన్నా వివాహం ఆలస్యం.
In Stock
Recent Views
Karthika Masotsavam
₹10,116.00Rahu Kethu (Kalasarpa Dosha)
₹11,000.00Marriage Delay
₹2,000.00
Description
పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు
పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలలో కొన్ని అంశాలు ఇక్కడ అందిస్తున్నాము
1. లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి లేదా విడివిడిగా 6,8,12 స్థానాల్లో ఉంటే ఆలస్య వివాహం.
2. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా వివాహం ఆలస్యం.
3. సప్తమాధిపతి రాహు, కేతు నక్షత్రాల్లో ఉన్నా వివాహం ఆలస్యం.
4. సహజ సప్తమమైన తులలో నైసర్గిక పాప గ్రహాలుంటే దానికి అనుబంధ రాశులైన కన్య, వృశ్చికాలలో పాప గ్రహాలుంటే వైవాహిక జీవితంలో లోపం.
5. లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి సప్తమస్థానాన్ని బలమైన పాప గ్రహాలు చూస్తున్న వివాహం జరుగదు, లేదా ఆలస్యమౌతుంది.
6. శుక్రుడు ఉన్న రాశ్యాధిపతి నీచలో ఉన్నా లేదా 6,8,12 స్థానాల్లో ఉన్నా ఆలస్య వివాహం.
7. శుక్రుడి నుండి సప్తమంలో కుజ, శనులు ఉంటే లేదా కుజ, శనులు పరస్పరం ఎదురెదురుగా ఉంటే ఆలస్య వివాహం.
8. శుక్ర, చంద్ర, గురు, రవి గ్రహాలు నీచలో ఉంటే వివాహం ఆలస్యమౌతుంది.
9 పాపకర్తరీ మధ్యలో గ్రహాలుంటే దోషం, ఆలస్య వివాహం.
10. రవి, శనులు కలిసి సప్తమ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం
నూతన దంపతులు-వివాహ జీవితం
వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి.
ఇప్పుడున్న తరానికి ముందు తరం వాళ్లు అయితే ఏదో రకంగా సంసార జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్దుకు పోతుండేవారు.
ఈ కాలం పిల్లలు అయితే అస్సలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. వివాహ పొంతన సరిగా లేనప్పుడు గ్రహ రీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు భార్యాభర్తలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇటువంటి ఇబ్బందులు లేదా వడి దుడుకులు పూర్వం ఆడవాళ్లు అయితే భరించారు. ప్రస్తుతం వివాహ పొంతనలో దోషం ఉన్నప్పుడు గ్రహాలు ద్వారా వచ్చే ఇబ్బందులను ఆడపిల్లలు ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. వివాహ పొంతన సరిగా చూడకుండా కేవలం గణాలు లేదా పాయింట్లు 18 నుండి 36 మధ్యలో వచ్చినప్పుడు వివాహాలు చేస్తున్నారు.
కేవలం ఈ గణాలు ఆధారంగా మాత్రమే కాకుండా అబ్బాయి అమ్మాయి యొక్క ఇద్దరి జాతకాలు పరిశీలించాలి.
ఈ పరిశీలనలో కాబోయే భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఉంటారా ఉండరా అనే విషయం, విడిపోయేలా ఉంటే పోలీస్ కేసులు కోర్టు గొడవలు భరణాలతో విడిపోతారా లేదా ఏ గొడవ లేకుండా విడిపోతారా అనే విషయం కూడా తెలుస్తుంది. జాతకాల పరిశీలించినప్పుడు ఇది కచ్చితంగా తెలుస్తుంది.
కొంతమంది వివాహ జీవితంలో మానసికంగా ఎవరో ఒకరు టార్చర్ పెడుతూ ఉంటారు, మరి కొంతమందికి రెండు వివాహాలు జరుగుతుంటాయి.
కొంతమంది వివాహం తర్వాత ఆర్థికంగా బలహీన పడిపోతుంటారు.
మాంగళ్య స్థానం బలహీనమైతే అతి తక్కువ కాలంలోనే ఎవరో ఒకరు కాలం చేస్తారు.
ముఖ్యంగా కుజదోషం కూడా పరిశీలించాలి.9246369606.
కొంతమందికి వివాహం అయిన తర్వాత సంతానం కలగదు ఇటువంటి సమస్యలు అన్ని వివాహ పొంతనలో ఇద్దరి జాతకాలు పరిశీలిస్తే తెలుస్తుంది.
ఈ విషయాలు ఏమీ పరిశీలించకుండా కేవలం 18 నుండి 36 గణాల మధ్యలో వస్తే వివాహాలు చేసేస్తున్నారు.
గణాలతోపాటు పై జాతక పరిశీలన మొత్తం చేయాల్సి ఉంటుంది. వివాహం అంటే రెండు జీవితాలు మాత్రమే కాదు రెండు కుటుంబాలు రెండు తరాలకు సంబంధించిన సంతోషకరమైన బంధం వలే ఉండాలి.ఇటువంటి విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు.
కావున ఇద్దర జాతకాలు పరిశీలించే జ్యోతిష్యులను సంప్రదించి వివాహ సంబంధాలను నిశ్చయం చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది.
పిల్లల జీవితానికి ఒక అర్థం ఉంటుంది. వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం
చిన్న పరిహారం చేస్తే భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్యలైతే తీరిపోయి అన్యోన్యంగా ఉంటారు.
పిల్లల వివాహ జీవితం కాస్త ఒడిదుడుకులుగా ఉంటే ఆమె తల్లి శివాలయంలో ఒక దీపం వెలిగిస్తూ ఉండాలి.
ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యి , విప్ప నూనె, కొబ్బరి నూనె సమానంగా ఒక మట్టి ప్రమిదలో పోసి రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి.
తన కూతురు కాపురం బాగుండాలని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి.
ఈ విధంగా చేస్తూ ఉంటే దంపతుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగి వారి దాంపత్య బంధం అన్యోన్యంగా ఉంటుంది
*నవగ్రహాలు – ప్రదక్షిణ విధానం*
మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.
గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ,
లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది.
నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.
ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు.
శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.
కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు.
సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.
నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి
ఎడమ వైపు నుండి అంటే చంద్రుని వైపు నుంచి.. కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడి వైపు నుంచి..
రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.
చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి,
నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.
శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది.
మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.
“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి.
9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా
రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు.









Reviews
There are no reviews yet.