Karthika Masotsavam
₹10,116.00
*కార్తీక మాస* పర్వదినాలు…iii
14/11/2023 మంగళవారం
*కార్తీక మాస ప్రారంభము*
15/11/2023 బుధవారం
*యమ విదియ, భగినీ హస్త భోజనం* అన్నాచెల్లుల పండుగ
17/11/2023 శుక్రవారం
*నాగుల చవితి* (భక్తులు స్వయంగా పాలు పోసుకోవచ్చు)
20/11/2023 సోమవారం
*కార్తీక సోమవారం – 1*
23/11/2023 గురువారం.
*ఏకాదశి*
24/11/2023 శుక్రవారం
*క్షీరాబ్ది ద్వాదశి*
25/11/2023 స్థిరవారం.
*శని త్రయోదశి*
26/11/2023 ఆదివారం
*కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం*
27/11/2023 సోమవారం
*కార్తీక సోమవారం 2*
30/11/2023 గురువారం
*ఆరుద్ర నక్షత్రము*
04/12/2023 సోమవారం
*కార్తీక సోమవారం – 3*
10/12/2023 ఆదివారం *త్రయోదశి నందీశ్వర అభిషేకం*
11/12/2023 *కార్తీక సోమవారం – 4,మాస శివరాత్రి |*
12/12/2023 మంగళవారం.
*అమావాస్య*
13/12/2023 బుధవారం.
*పోలిస్వర్గం*
పరమ పవిత్రమైన కార్తీక మాసమందు శ్రీమన్నారాయణుడు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడు అనుక్షణమూ అధివసించి ఉంటారు.
అట్టి శివకేశవుల నిత్య పర్వమైన ఈ కార్తీక మాసమందు విశేషపర్వములైన కార్తీక సోమవారములు, క్షీరాబ్ది ద్వాదశి పర్వము, మహామంత్రానుష్ఠానములు
సయితము పరిపక్వ మొందెడి కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శివరాత్రి, కార్తీక నక్తములు మున్నగునవి సర్వదేవతారాధ్యములై మహాపుణ్యప్రదములై ఉన్నవి.
ఇట్టి కార్తీక మాసమున ఈశ్వరారాధనము సమస్త ఐశ్వర్యప్రదాయకము, సర్వేతి భాధా నివారకము, సర్వ శుభాతిశయ సంవిధాయకము,
ఇహపర సౌఖ్యానంద సంధాయకము అని సర్వశాస్త్రములు, మున్నగు పురాణేతిహాసములు చెప్పుచున్నవి.
అట్టి మహాపర్వదినములైన కార్తీక మాసమంతయు సర్వసాధారణంగా దేవాలయాదులలో నిర్వహించే పూజ, అర్చన, అభిషేక, హోమాదులకు
భిన్నంగా విలక్షణమైన పద్ధతిలో నిత్య మహాలింగార్చనము ప్రక్రియ.
In Stock
Description
సోమవారం నాడు శివుడిని పూజిస్తే ఋణ బాధలు ( అప్పులు ) వదిలిపోతాయి …
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.
ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం.
సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్రమ్, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.
1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి.
పూలు సమర్పించుకోవాలి ( తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి ). తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి.
సాయంత్రం వరకు ఉపవాసము ( పాలు , పండ్లు వంటివి తీసుకోవచ్చు ) ఉండి , శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి .
2. సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు.
ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.
3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.
4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.
5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు…స్వస్తి.
భక్తి భాగ్య మహాశయులారా!
పరమ పవిత్రమైన కార్తీక మాసమందు శ్రీమన్నారాయణుడు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడు అనుక్షణమూ అధివసించి ఉంటారు. అట్టి శివకేశవుల నిత్య పర్వమైన ఈ కార్తీక మాసమందు విశేషపర్వములైన కార్తీక సోమవారములు, క్షీరాబ్ది ద్వాదశి పర్వము, మహామంత్రానుష్ఠానములు సయితము పరిపక్వ మొందెడి కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శివరాత్రి, కార్తీక నక్తములు మున్నగునవి సర్వదేవతారాధ్యములై మహాపుణ్యప్రదములై ఉన్నవి. ఇట్టి కార్తీక మాసమున ఈశ్వరారాధనము సమస్త ఐశ్వర్యప్రదాయకము, సర్వేతి భాధా నివారకము, సర్వ శుభాతిశయ సంవిధాయకము, ఇహపర సౌఖ్యానంద సంధాయకము అని సర్వశాస్త్రములు, మున్నగు పురాణేతిహాసములు చెప్పుచున్నవి.
అట్టి మహాపర్వదినములైన కార్తీక మాసమంతయు సర్వసాధారణంగా దేవాలయాదులలో నిర్వహించే పూజ, అర్చన, అభిషేక, హోమాదులకు భిన్నంగా విలక్షణమైన పద్ధతిలో నిత్య మహాలింగార్చనము ప్రక్రియ. అనగా మానవుడు ప్రతీరోజు ఒక అంగుళము మట్టి శివలింగాన్ని తయారుచేసుకొని నిత్యము అభిషేకము చేసుకోవాలి. కానీ ఈ కలియుగంలో ఇది సాధ్యపడదు.
కనుక ఈ విధంగా 366 శివ లింగాలతో ఒక్కసారి మహాలింగార్చన చేసే కల్పము మహర్షులు దివ్య ఆశీస్సులతో మనకు అందించి యున్నారు. ఈ కార్యక్రమములు సుప్రసిద్ధ పండితులు, మరియు ఋత్విక్కులు మున్నగు వారిచే సశాస్త్రీయ విధానంగా ప్రతి సంవత్సరము జరిపించుటకు సంకల్పించబడినది.
మహాలింగ శతరుద్రీయ కల్పదీక్షా కాలము :
కార్తీక మాస శుద్థ ప్రతిపత్
తేదీ 22-10-2025 నుండి అమావాస్య పర్వము తేదీ 20-11-2025 వరకు జరుగును.
చివరి నాడు మహా ప్రసాద(కార్తీక సమారాధన) అన్న సంతర్పణ జరుగును.
గమనిక : పరిమితమైన సంఖ్యలో యోగ్యులయిన యజమానులకు మాత్రమే ఈ సదవకాశము కల్పించబడుచున్నది.
కేవలము యజమాని దంపతులకు రుసుము నెల రూ॥ 10116/-లు మాత్రము దక్షిణగా పరమేశ్వరుని పాదపద్మముల చెంత భక్తితో సమర్పించి భక్తి భాగస్వామ్య అవకాశమును పొందవచ్చును.
అవకాశము ఉన్నవారు ప్రతి నిత్యము తప్పక వచ్చి తీర్థ ప్రసాదములు తీసుకొనగలరు. అరుదైన ఈ మహా భాగ్యాన్ని వెంటనే పొందగలరు.
ఒక్కరోజు మహాలింగార్చన 2500/-లు ఏకవార రుద్రాభిషేకము 1116/-లు
రుద్ర క్రమార్చనకు 1516/-లు ఛండీ హోమములో దంపతులకు 3116/-
అన్నదాన సమారాధనకు తమకు తోచినంత వస్తువులు లేదా విరాళములు ఇవ్వవచ్చును.
ప్రతి నిత్యము జరుగు కార్యక్రమ వివరములు :
విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరుణము, దీక్షాధారణము, సర్వదేవతా మంటపారాధనలు,మృత్తికాగ్రహణము,మహాన్యాసముప్రస్తార పూజలు – కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన, ఆవరణార్చనలు, పంచామృత, పంచసూక్త, శతరుద్రీయ అభిషేకములు, రుద్రక్రమార్చన, నీరాజన మంత్రపుష్పములు, ఉపచార పూజలు అమావాస్య మహా పర్వము నందు బాలాత్రిపుర సుందరీ చండీ హోమము, పూర్ణాహుతి, అవభృధములు, దీక్షా విరమణ, అశీర్వచనము, మార్గశీర్ష శుద్ధ ప్రతిపత్ నందు బ్రాహ్మణ ఋత్విక్ సమారాధనములు జరుగును.
కావున యావన్మంది భక్త భాగ్య మహాశయులు విచ్చేసి పై కార్యక్రమములకు ధన, వస్తు రూపేణా సహకరించి సర్వదేవతా అనుగ్రహమునకు పాత్రులు కాగలరని మనవి.
మంగళం మహత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ





Reviews
There are no reviews yet.