Subtotal: ₹13,116.00
You have 2 items in your cartSatha Chandi Yagam
₹10,000.00
శత చండీ యాగ మహోత్సవ ఆహ్వానము
‘‘కలౌ చండీ వినాయకౌ ’’ కలియుగమున చండీ అమ్మవారు గణపతి త్వరగా అనుగ్రహిస్తారు అని శాస్త్ర వచనం. చండీ పారాయణ, హోమములకు మించిన శక్తివంతమైన ఫలసాధనము మరొకటి లేదని ఇహ పర సౌఖ్యమునకు చండీ హోమము అత్యంత ఉత్తమము అని శాస్త్రములు తెలుపుతున్నవి. మార్కండేయ పురాణాంతర్గతముగా ఉన్న ఏడువందల శ్లోక రూప మంత్రములను వందసార్లు పారాయణము చేసి హోమము చేయడమే శతచండీ అంటే.
లోకకళ్యాణార్థము, దుఃఖ శోక ఉపశమనమునకు, దేశోపద్రవాలు శాంతించుటకు, సర్వగ్రహానుకూలతకు, అనేక భయభీతులు తొలగుటకు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తికి, సకల రోగాలు తొలగుటకు, పిల్లలు చదువు అభివృద్థి కోసము, సంతాన సిద్ధికి, వివాహం కాని వారికి వివాహం కోసం, ఋణ బాధలు తొలగుటకు, సర్వకార్య సిద్థి, సకల కోరికలు సిద్ధించుటకు మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణీ చండీ పరాశక్తి అనుగ్రహము కోసము సాక్షాత్ పరమేశ్వర స్వరూపులు అగు శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వార్ల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ లక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీ చిలుకూరి శ్రీనివాసమూర్తి గురువుల ఆచార్య బ్రహ్మత్వమున ప్రతి నెలా ఫౌండేషన్లో అనేక మంది పండితుల సమక్షములో త్రయాహ్నిక దీక్షగా శతచండీయాగము నిర్వహించబడును. కావున భక్తాగ్రేసరులు తమ శక్తికొలది అన్నదానమునకు, ఈ బృహత్ కార్యక్రమమునకు భూరి విరాళములు ఇచ్చి ధర్మ పరిరక్షణార్థం జరుగు ఈ కార్యక్రమములో భాగస్వాములై అమ్మ కృపాకటాక్షములు పొందగలరని అందరినీ ఆహ్వానిస్తున్నాము.
* శ్రీ ఛండీ హోమంలో పాల్గొనేవారు దంపతులకు 10,116/-రుసుము. శ్రీ చక్ర అర్చనలో పాల్గొనే స్త్రీలు 2116/- రుసుము. గోత్రనామాలతో చదివించుటకు 1116/- రుసుము చెల్లించి రసీదు పొందగలరు.కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ కలదు. ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్న సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును. కావున సదరు పై విషయములను మీకు తెలిసిన వారందరికీ పంపించి సహాయ సహకారములు అందించ మనవి.
ఇట్లు,
శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్
In Stock
Recent Views
Satha Chandi Yagam
₹10,000.00
Description
శత చండీ యాగ మహోత్సవ ఆహ్వానము
‘‘కలౌ చండీ వినాయకౌ ’’ కలియుగమున చండీ అమ్మవారు గణపతి త్వరగా అనుగ్రహిస్తారు అని శాస్త్ర వచనం. చండీ పారాయణ, హోమములకు మించిన శక్తివంతమైన ఫలసాధనము మరొకటి లేదని ఇహ పర సౌఖ్యమునకు చండీ హోమము అత్యంత ఉత్తమము అని శాస్త్రములు తెలుపుతున్నవి. మార్కండేయ పురాణాంతర్గతముగా ఉన్న ఏడువందల శ్లోక రూప మంత్రములను వందసార్లు పారాయణము చేసి హోమము చేయడమే శతచండీ అంటే.
లోకకళ్యాణార్థము, దుఃఖ శోక ఉపశమనమునకు, దేశోపద్రవాలు శాంతించుటకు, సర్వగ్రహానుకూలతకు, అనేక భయభీతులు తొలగుటకు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తికి, సకల రోగాలు తొలగుటకు, పిల్లలు చదువు అభివృద్థి కోసము, సంతాన సిద్ధికి, వివాహం కాని వారికి వివాహం కోసం, ఋణ బాధలు తొలగుటకు, సర్వకార్య సిద్థి, సకల కోరికలు సిద్ధించుటకు మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణీ చండీ పరాశక్తి అనుగ్రహము కోసము సాక్షాత్ పరమేశ్వర స్వరూపులు అగు శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వార్ల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ లక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీ చిలుకూరి శ్రీనివాసమూర్తి గురువుల ఆచార్య బ్రహ్మత్వమున ప్రతి నెలా ఫౌండేషన్లో అనేక మంది పండితుల సమక్షములో త్రయాహ్నిక దీక్షగా శతచండీయాగము నిర్వహించబడును. కావున భక్తాగ్రేసరులు తమ శక్తికొలది అన్నదానమునకు, ఈ బృహత్ కార్యక్రమమునకు భూరి విరాళములు ఇచ్చి ధర్మ పరిరక్షణార్థం జరుగు ఈ కార్యక్రమములో భాగస్వాములై అమ్మ కృపాకటాక్షములు పొందగలరని అందరినీ ఆహ్వానిస్తున్నాము.
హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరిసంపదల కోసం చండి హోమం నిర్వహించడం జరుగుతుంది. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.
Astami We perform special Chandi Homam with our Spiritual Team with Devotees attend on this Homam, all are attend and get prasadam of Chandi. This day is very auspicious. Dont miss.
శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నారపల్లి, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ప్రతి మాసము శుక్ల పక్ష అష్టమి నాడు శ్రీ ఛండీ పారాయణ హోమం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు.
స్త్రీలతో కుంకుమార్చన జరుపబడును.
కార్యక్రమం వివరాలు
* ఉదయం ఏడు గంటలకు గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవాచనం, నవగ్రహస్థాపన, రాజశ్యామల కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన,
నవగ్రహ ఆవాహన, శ్రీ ఛండీ హోమం, కూష్మాండబలి, పూర్ణాహుతి.
* హోమగుండం వద్ద దంపతులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం.
* శ్రీ చక్ర అర్చనలో మహిళలందరికీ అవకాశం.
* ఛండీ యాగమునకు విశేషమైన ఫలితములు కలవు. రాజ్యాధికారం, శతృ నివారణ, సమాజంలో గౌరవము, సకల కార్యసిద్ధి
జరుగును.
* శ్రీ చక్ర అర్చన వలన లక్ష్మీ కటాక్షం మరియు ఆరోగ్యము ఆనందము కలుగును.
https://slgvfoundation.com/donations/
* శ్రీ ఛండీ హోమంలో పాల్గొనేవారు దంపతులకు 10,116/-రుసుము. శ్రీ చక్ర అర్చనలో పాల్గొనే స్త్రీలు 1116/- రుసుము.
గోత్రనామాలతో చదివించుటకు 516/- రుసుము చెల్లించి రసీదు పొందగలరు.
కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ కలదు.
ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్న సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల
పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును. కావున సదరు పై విషయములను మీకు తెలిసిన వారందరికీ పంపించి సహాయ
సహకారములు అందించ మనవి.
ఇట్లు,
శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్

Reviews
There are no reviews yet.