పరమ పవిత్రమైన కార్తీక మాసమందు శ్రీమన్నారాయణుడు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడు అనుక్షణమూ అధివసించి ఉంటారు.
అట్టి శివకేశవుల నిత్య పర్వమైన ఈ కార్తీక మాసమందు విశేషపర్వములైన కార్తీక సోమవారములు, క్షీరాబ్ది ద్వాదశి పర్వము, మహామంత్రానుష్ఠానములు సయితము పరిపక్వ మొందెడి కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శివరాత్రి, కార్తీక నక్తములు మున్నగునవి సర్వదేవతారాధ్యములై మహాపుణ్యప్రదములై ఉన్నవి.
ఇట్టి కార్తీక మాసమున ఈశ్వరారాధనము సమస్త ఐశ్వర్యప్రదాయకము, సర్వేతి భాధా నివారకము, సర్వ శుభాతిశయ సంవిధాయకము,
ఇహపర సౌఖ్యానంద సంధాయకము అని సర్వశాస్త్రములు, మున్నగు పురాణేతిహాసములు చెప్పుచున్నవి.
అట్టి మహాపర్వదినములైన కార్తీక మాసమంతయు సర్వసాధారణంగా దేవాలయాదులలో నిర్వహించే పూజ, అర్చన, అభిషేక, హోమాదులకు
భిన్నంగా విలక్షణమైన పద్ధతిలో నిత్య మహాలింగార్చనము ప్రక్రియ.

సమస్త పూజా కార్యక్రమములు తక్కువ ఖర్చులోనే !
గృహప్రవేశ, ఉపనయయము, వ్రతాలు, నిశ్చితార్థము, అన్ని పెళ్ళి కార్యక్రమాలు, మహన్యాస రుద్రాభిషేకం, నామకరణ, అన్నప్రాసన, నవగ్రహ నక్షత్ర శాంతులు, హోమాలు ఉంటే మాకు తెలియచేయగలరు. శాస్త్రోక్తంగా మీ కుటుంబ ఆచారవ్యవహారాలకు సాంప్రదాయాలకనుగుణంగా పూజ చేయించగలము. అన్ని బాషలలో తమ అనుకూలతల మేరకు సంభాషించి దిగ్విజయముగా వైదిక క్రతువులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యవాస్తు శాస్త్రజ్ఞులు, మంత్ర, తంత్ర శాస్త్ర ప్రావీణ్యులు బ్రహ్మశ్రీ చిలుకూరి శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో నిర్వహించగలము.

ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్నప్రాద సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును.
కావున సదరు పై విషయములను మీకు తెలిసిన వారందరికీ పంపించి భక్తులు మనసా, వాచా, కర్మణ ధన, వస్తు రూపేణ సహకరించి సంస్థ అభివృద్ధికి మీ సహాయ సహకారములు అందించగలరని మా విన్నపం.
ముఖ్యగమనిక : ఈ సంస్థ ఆదాయపు పన్నుశాఖలో సెక్షన్ 80 జి క్రింద నమోదు అయి పన్నుమినహాయింపును కలిగి ఉన్నది.