Srichakra Archana Puja
₹11,116.00
శ్రీ చక్ర అర్చన వలన ఉపయోగాలు. శ్రీ చక్ర అర్చన పూజలు ప్రధానమైనటువంటిది, దేవి ఆరాధన, నవావరణ అర్చన ద్వారా మనిషి తన యొక్క శరీరాన్ని శ్రీచక్రం గా భావించి ఆరాధన చేయవలసి ఉంటుంది. వీటిలో ప్రధానంగా అరిషడ్వర్గాలను జయించడానికి తద్వారా మహాకామేశ్వరి అయిన జగదాంబ అనుగ్రహం పొందటానికి అమ్మ యొక్క చరణాలను చేరడానికి ఈ శ్రీ చక్ర అర్చన విధానము ఉపయోగపడుతుంది. అమ్మ దయ లభిస్తే అన్నీ లభించినట్టే అని మన పెద్దలు చెప్పేవారు.
In Stock
Description

మూలమంత్రాత్మక మూలకూటత్రయ కళేబరా శరీరంలో మూలాధారము దగ్గర నుండి త్రిపురాలను జయించే శక్తి ప్రసాదిస్తుంది. మనసు లోపల ఉండే మానసిక రుగ్మతలను తొలగిస్తుంది. తద్వారా అమృత తుల్యమైన ఆత్మ దర్శనం పొంది అనంతమైన సాగరాన్ని జయించడానికి శక్తిని ప్రసాదిస్తుంది.
మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంధి విభేధిని.. మణిపురాంత రుధిరా విష్ణు గ్రంధి విభేధినీ.. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంధి విభేదిని సహస్రారం భుజారూఢ సుధాసారాభి వర్షిణి శ్రీ చక్ర సాధన చేయటం వల్ల మూలాధార నిలయులైన గణపతి బ్రహ్మ దేవుని అనుగ్రహంతో సకల ఆటంకాలను తొలగించుకొని ఉత్తమ మార్గాన్ని సాధించడానికి దారి చూపుతుంది.
మాయా నిర్మితమై గుప్తంగా ఉన్నటువంటి రక్త మాంసాలతో ఉన్న శరీరం వల్ల ఏర్పడిన అంధకారాన్ని విచ్ఛిన్నం చేసి వెలుగును ప్రసాదిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి అమృత బిందువులలో ఆనందాన్ని సిద్ధింప చేస్తుంది. ఆ ఆనందమే ఆనంతము. శాశ్వతమైన సుఖసంతోషాలకు నిలయము. అదే శ్రీచక్ర బిందు త్రికోణ మూలము. ఆ స్థాయిలో ఉన్నవాళ్లు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనలో జీవిస్తారు. ఉదాహరణకు శంకరాచార్యుల వారు, అర్ధనారీశ్వరులు, త్రిమూర్తులు.
ప్రతి నిత్యం, విశేష పంచాయతన పూజ, శ్రీచక్రార్చన, సహస్ర కుంకుమార్చన, ప్రతి పౌర్ణమినాడు విశేష శ్రీచక్రార్చన, సహస్రనామ పారాయణ జరుగుతుంది.

Reviews
There are no reviews yet.