Durga Nava Rathri
ప్రధమం శైలపుత్రిణి,ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకమ్||
పంచమం స్కంధమాత్రేతి షష్ఠం కాత్యాయనీతిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధిదాత్రి ప్రోక్త,నవదుర్గా ప్రకీర్తితః ||
కావున ఆస్తిక మహాశయులు తమ యొక్క గోత్రనామములను తగిన రుసుము చెల్లించి కార్యక్రమంలో పాల్గొని సకల శత్రు బాధలను, ఆర్థిక బాధలను, న్యాయ చిక్కులను పరిష్కరించుకుని ఆ జగన్మాత అయిన దేవి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు.9రోజులు అభిషేక అర్చనలకు : 5,116/- 9 రోజులకు సాయంకాల నవావరణ అర్చన, హోమమునకు : 10,116/-(9రోజులలో 1రోజు మాత్రమే హోమములో స్వయంగా చేసుకొనే అవకాశం)
నిత్యము పంచభక్ష ప్రసాదములకు, ఇతర నైవేద్యాధి ద్రవ్యములకు, పూలదండలు, బియ్యము, ఆవునెయ్యి, కూరగాయలు, లైటింగ్,నాదస్వరం, పూల అలంకరణ, పూలమాలలు, పట్టువస్త్రములు,పూజా ద్రవ్యములు, ప్రసాద వితరణకు, మౌళిక వసతులు గురించి దాతలు సహకరించేవారు ద్రవ్య రూపంలో తమ శక్తి కొలది వస్తు రూపంలో, ధన రూపంలో సహాయ సహకారాలు అందించగలరు.
Description
దేవీ నవరాత్రులు
కావున ఆస్తిక మహాశయులు తమ యొక్క గోత్రనామములను తగిన రుసుము చెల్లించి కార్యక్రమంలో పాల్గొని సకల శత్రు బాధలను, ఆర్థిక బాధలను, న్యాయ చిక్కులను పరిష్కరించుకుని ఆ జగన్మాత అయిన దేవి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. 9 రోజులు అభిషేక అర్చనలకు : 5,116/-
9 రోజులకు సాయంకాల నవావరణ అర్చన, హోమమునకు : 10,116/-(9రోజులలో 1రోజు మాత్రమే హోమములో స్వయంగా చేసుకొనే అవకాశం)
అమ్మవారి సేవలు
ప్రతిరోజు ఉదయం 07:30 ప్రత్యేక ద్రవ్యములతో అష్ఠోత్తర శతకలశ అభిషేకం
09:00 అమ్మవారి అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చన విశేష పుష్పాలతో,
కవచం, ఖడ్గమాల, నీరాజన మంత్రపుష్పాదులు
సా॥ 06.00 గంటలనుండి అమ్మవారికి నవావరణ పూజ, సహస్రనామార్చన,
విశేష ద్రవ్యాలతో మూల మంత్ర హోమములు, నైవేద్యము, మంత్రపుష్పము, తీర్థ, మహాప్రసాద వినియోగము.
నిత్యము పంచభక్ష ప్రసాదములకు, ఇతర నైవేద్యాధి ద్రవ్యములకు, పూలదండలు, బియ్యము, ఆవునెయ్యి, కూరగాయలు, లైటింగ్,నాదస్వరం, పూల అలంకరణ, పూలమాలలు, పట్టువస్త్రములు,పూజా ద్రవ్యములు, ప్రసాద వితరణకు, మౌళిక వసతులు గురించి దాతలు సహకరించేవారు ద్రవ్య రూపంలో తమ శక్తి కొలది వస్తు రూపంలో, ధన రూపంలో సహాయ సహకారాలు అందించగలరు.
శరన్నవరాత్రులు (దుర్గా దేవి నవరాత్రులు) తొమ్మిది అవతారాలు విశిష్టత.
స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి బాలా త్రిపుర సుందరీ: (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ది.22.09.25) శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ప్రథమ స్థానంలో ఉంది. సకల శక్తి పూజలకు మూలమైన ఆమెను దర్శించి పూజలు చేస్తే. సంవత్సరం అంతా మంచి కలుగుతుందని భావన.
శ్రీ గాయత్రి దేవి: (ఆశ్వీయుజ శుద్ధ విదియ ది.23.09.25) సమస్త మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం. అందుకే ముక్తా విద్రుమ హేమనీల ధవల పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. త్రిసంధ్యా సమయాల్లో గాయత్రి మంత్రాన్ని పటిస్తూ ఉంటారు.
శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: (ఆశ్వీయుజ శుద్ధ తదియ ది.24.09.25) సమస్త జీవరాసి మనుగడకు ఆధారం ఆహారం. సాక్షాత్తు పరమ శివుడికే అన్నం పెట్టిన మాతగా శ్రీ అన్నపూర్ణా దేవికి పేరు ఉంది. అందుకే అన్నం జీవుల మనుగడకు ఆదారంగా భావిస్తారు. ఈ రూపంలో దర్శిస్తే ధన ధాన్య వృద్ధి ఉంటుందని చెబుతారు.
శ్రీ మహాలక్ష్మి దేవి: (ఆశ్వీయుజ శుద్ధ చవితి ది.24.09.25) అవతారం అత్యంత మంగళ ప్రదంగా భావిస్తారు. అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. శరన్నవ రాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.
శ్రీ మహా చండీ దేవి: (ఆశ్వీయుజ శుద్ధ సోమవారం ది.25.09.25)
శ్రీ మహా సరస్వతీ దేవి: (మూలా నక్షత్రం) (ఆశ్వీయుజ శుద్ధషష్టి ది.26.09.25) చదువుల తల్లిగా సరస్వతీ దేవిని కొలుస్తారు. త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి ఉంటారు. అక్షర మాల ధరించి, దండ, కమాండలంతో వీణా ధారణలో ఉంటుంది. అభయముద్రతో అమ్మవారు భక్తుల అజ్ఞానాన్ని దూరం చేస్తుంది.
శ్రీ లలితా త్రిపుర సుందరీ: (ఆశ్వీయుజ శుద్ధ సప్తమి ది.26.09.25) ఈ రూపాన్నే ఉగ్ర రూపిణిగా లేదా చండీదేవిగా పిలుస్తారు.. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. దీని వల్ల సమస్త శుభాలు లభిస్తాయి.
*శ్రీ దుర్గా దేవి అలంకారం:*( దుర్గాష్టమి)(ఆశ్వీయుజ శుద్ధ అష్టమి ది.27.09.25) దుర్గతులను నాశనం చేసే రూపమే శ్రీ దుర్గా దేవి. ఆ రోజు దుర్గముడు అనే రాక్షసున్ని సంహరించింది. కనుక దేవిని ‘దుర్గ’ అని కూడా పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తారు. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను పూజించాలి.
శ్రీ మహిషాసుర మర్ధినీ: (మహర్నవమి) (ఆశ్వీయుజ శుద్ధ నవమి ది.28.09.25) మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది. రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసిందని చరిత్ర చెబుతోంది.
శ్రీరాజరాజేశ్వరి దేవి: (విజయదశమి) (ఆశ్వీయుజ శుద్ధ దశమి 29.09.25 సాయంత్రం) ఇక చివరి అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి. అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత’ అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి ‘విజయ’ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది.





Reviews
There are no reviews yet.