Raja Syamala Devi
₹10,116.00
మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2025 జనవరి 30న ప్రారంభమై ఫిబ్రవరి 7న ముగుస్తాయి..
వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..
అవి ఏవిటంటే.. 1. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు. 2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు. 3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు. 4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి..చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికి తెలుసు..కానీ మిగిలిన రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు..
దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి. గుప్త నవరాత్రులంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరిని పిలిచి చేయరు. కావున మీ గోత్ర నామాలు తెలియచేసిన ఈ కార్యక్రమాలు ముగించిన తరువాత మీకు ప్రసాదం కొరియర్ల ద్వారా గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేసి పంపగలము.
ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో గానీ , వ్యాపారంలో గానీ అభివృద్ది కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది.. అంతేకాదు ముఖ్యంగా పెళ్లికాని వారికి పెళ్లి అవుతుందని పురాణాల్లో తెలియజేసారు…
పూర్వం బండాసారుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అనికూడా అంటారు. అంతేకాకుండా దశమాహా విద్యలలో మాతంగి అని కూడా పిలుస్తారు.
ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 30 మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, ఫిబ్రవరి 07 ముగుస్తాయి.
అందులో మొదటి రోజు
అమ్మవారిని “లఘు శ్యామలాదేవి” రూపంలో, రెండవ రోజు అమ్మవారిని, “వాగ్వాధినీ శ్యామలాదేవి” రూపంలో, మూడోరోజు అమ్మవారిని “నకుల శ్యామలాదేవి” రూపంలో, నాల్గవ రోజు అమ్మవారిని “హాసంతి శ్యామలాదేవి” రూపంలో, ఐదవ రోజు అమ్మవారిని “సర్వసిద్ధి మాతంగి” రూపంలో, ఆరవ రోజు అమ్మవారిని “వాస్యమాతంగి” రూపంలో, ఏడవ రోజు అమ్మవారిని “సారికా శ్యామలాదేవి” రూపంలో, ఎనిమిదవ రోజు అమ్మవారిని “శుక శ్యామలాదేవి” రూపంలో, తొమ్మిదవ రోజు అమ్మవారిని “రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
శ్యామలాదేవికి నిత్యపూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన జరుగును. మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగు వాటిని పారాయణ చేస్తు పూజలు జరుగును.
విరాళాల వివరాలు క్రింద ఉన్నాయి:వస్తువులు మరియు విరాళాలు బాదం (5 కిలోలు), ఎండుద్రాక్ష (5 కిలోలు), జీడిపప్పు (5 కిలోలు), అన్నదానం (ఆహారం అందించడం): రోజుకు ₹50,000, పూల దండలు మరియు పువ్వులు: రోజుకు ₹5,000, తామర పువ్వులు మరియు తమలపాకులు: రోజుకు ₹1,500, వట్టివేరు (10 కిలోలు): అభ్యర్థనపై అందుబాటులో ఉన్న విరాళాల వివరాలు మీరు ఈ వస్తువులను డెలివరీ చేయడానికి ఎంచుకోవచ్చు లేదా ద్రవ్య విరాళాలు ధన రూపంగా పంపవచ్చు. మీ భాగస్వామ్యం ఈ వేడుకల పవిత్రతను పెంచుతుంది మరియు మీ దయగల దాతృత్వానికి మేము కృతజ్ఞులం.
ద్రవ్య విరాళాల వివరాలు దయచేసి గమనించండి: లావాదేవీ రసీదుతో పాటు మీ పేరు మరియు పాన్ కార్డ్ నంబర్ లేదా మీ చిరునామాను (విదేశీ నివాసితుల కోసం) పంపండి. ఆడిట్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. డైరెక్ట్ డిపాజిట్ భారతదేశంలో లేదా ఇతర దేశాలలో భారతీయ బ్యాంక్ ఖాతా ఉన్నవారికి : శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, మేడిపల్లి బ్రాంచ్, హైదరాబాద్, కరెంట్ ఖాతా నంబర్: 108111100000256 IFSC కోడ్: UBIN0820661 ఈ దైవిక ప్రయత్నంలో మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్న సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును. కావున ఈ విషయములను మీకు తెలిసిన వారందరికీ అవకాశాన్ని కల్పించి సహాయ సహకారములు అందించ మనవి.
In Stock
Recent Views
Vanadurga Mahavidya
₹2,000.00Magha Abhisheka Mahotsav 2025
₹5,116.00Amavasya Puja Sri Vishnumaya
₹3,000.00
Description
మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2025 జనవరి 30న ప్రారంభమై ఫిబ్రవరి 7న ముగుస్తాయి..
వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..
ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..
అవి ఏవిటంటే..
1. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు.
2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.
3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.
4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.
ఈ శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి..చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికి తెలుసు..కానీ మిగిలిన రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు..
ఈ గుప్త నవరాత్రులంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరిని పిలిచి చేయరు. చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేసారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి..
ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో గానీ , వ్యాపారంలో గానీ అభివృద్ది కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది.. అంతేకాదు ముఖ్యంగా పెళ్లికాని వారికి పెళ్లి అవుతుందని పురాణాల్లో తెలియజేసారు…
పూర్వం బండాసారుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అనికూడా అంటారు. అంతేకాకుండా దశమాహా విద్యలలో మాతంగి అని కూడా పిలుస్తారు.
ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 30 మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, ఫిబ్రవరి 07 ముగుస్తాయి.
అందులో మొదటి రోజు
అమ్మవారిని “లఘు శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
రెండవ రోజు అమ్మవారిని
“వాగ్వాధినీ శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
మూడోరోజు అమ్మవారిని “నకుల శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
నాల్గవ రోజు అమ్మవారిని “హాసంతి శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
ఐదవ రోజు అమ్మవారిని “సర్వసిద్ధి మాతంగి” రూపంలో పూజిస్తారు.
ఆరవ రోజు అమ్మవారిని “వాస్యమాతంగి” రూపంలో పూజిస్తారు.
ఏడవ రోజు అమ్మవారిని “సారికా శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
ఎనిమిదవ రోజు అమ్మవారిని “శుక శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
తొమ్మిదవ రోజు అమ్మవారిని “రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.
శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగు వాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.
ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి..
మాతంగ కన్యని ప్రార్ధించడం వలన సాహిత్యం , చదువు , తెలివి, జ్ఞానం ప్రాప్తిస్తాయి.
మాతంగ మాత వీణాపాణి..శ్యామలా రూపంగా, సరస్వతీ స్వరూపమై అనుగ్రహించే ఈ దేవి బ్రహ్మగారి పక్కనుండే ఆయన అర్థాంగి కాదు . ఈ మాతంగ కన్య అమ్మవారి శక్తి . దశమహావిద్యల్లో ఒక స్వరూపం . మాతంగియే రాజ శ్యామల, లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లి ఈ శ్యామల. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధిస్తాయి.
తంత్రసారం మాతంగి మాతని నీలిరంగులో (శ్యామల వర్ణంలో ) ఉన్నట్టుగా వివరిస్తుంది . శ్యామల వర్ణం అనేది పూర్ణమైన జ్ఞానానికి ప్రతీక . శివశక్తి – జ్ఞానాంబిక గ , విష్ణుస్వరూపము – రాముడు, కృష్ణుడు ,వేంకటేశ్వరుడు ఇలా ఆ విష్ణు స్వరూపాలన్నీ కూడా ఇదే వర్ణం లో ఉండడము ఇక్కడ గమనించదగిన విషయము. ఇంకా ఆమె చంద్రవంకని శిరస్సున ధరించి , త్రినేత్రాలతో, చక్కని వెన్నెల వంటి నవ్వుతో విరాజిల్లే తల్లి ఈ మాతంగ మాత . 64 కళలకూ అధినేత్రి ఆమె . శారదాతిలకం అమ్మ రాజమాతంగి కూడా సరస్వతీ దేవిలాగానే వీణని చేతిలో ధరించి ఉంటుంది . కానీ ఈమెని మాతంగ శివుని భార్యగా కాళిదాసుని శ్యామలదండకం వర్ణిస్తుంది .
మాణిక్యవీణాం. ముఫలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్
మాతంగకన్యామ్ మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే.
కుచోన్నతే కుంకుమరాగశోణే.
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే… నమస్తే… నమస్తే…
జగదేకమాతః
ఈ అమ్మని కన్నులారా దర్శించుకొని, ఆ దేవీ స్వరూపాన్ని మనసు నిండా నిలుపుకొని , ఈ శ్యామలా దండకాన్ని రోజూ చదువుకుంటే, ఆ అమ్మ అనుగ్రహం సంప్రాప్తిస్తుంది . పిల్లలకి ఈ దండకాన్ని నేర్పించి రోజూ చదువుకునేలా చేస్తే, వారు అమ్మ అనుగ్రహంతో మంచి విజ్ఞానవంతులవుతారు . కాళిదాసు కూడా అలా విజ్ఞానవంతులైనవారే కదా !
ఈ దేవి మాతంగ మాతగా ఆవిర్భవించడం వెనుక ఒక కథ ఉంది . మహా తపస్సంపన్నుడు , విజ్ఞానఘని అయిన మతంగ మహర్షి కుమార్తెగా ఆ గౌరమ్మ ఆవిర్భవించింది. అందువలన ఆమె మాతంగ కన్యగా , మాతంగ మాతగా పేరొందింది .
మాతంగ మహర్షి వారు హిమవంతునికి స్నేహితుడు. ఒకనాడు హిమవంతుడు, ఆయన గౌరి దేవికి తండ్రిని అని , ఎంతో గర్వంగా , అతిశయంతో చెప్తారు. ఈ మాటకి అవమానపడినట్లుగా భావించిన , మతంగ మహర్షి తపస్సు చేస్తారు. ఆయన లలితాపరాభట్టారికా స్వరూపమైన శ్యామలాదేవి (ముద్రిణీ దేవి, మంత్రిణీదేవి అని కూడా అంటారు) ని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్యామలాదేవి, మతంగ మహర్షి భార్య అయిన సిద్ధమతి దేవికి స్వప్నంలో కనిపించి ఒక పువ్వుని ప్రసాదంగా ఇస్తారు.
అనతి కాలంలోనే మతంగ మహర్షి, సిద్ధమతిదేవి లకి ఒక చక్కని ఆడపిల్ల జన్మించినది. ఆ వచ్చినది అమ్మవారే. ఆమెని లఘుశ్యామ అని పిలిచారు. అంటే చాలా తక్కువ సమయంలో జన్మించింది అని. ఆమెనే మాతంగి, మాతంగ కన్యకా అని పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మతంగ కన్యయే, ఆమె యొక్క శక్తితో కోట్ల మంది కన్యలను సృష్టించినది, వారు మంత్రిణీ దేవి యొక్క ప్రాంగణంలో ఉండి అమ్మవారి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, మాతంగ మాత శ్యామల దేవికి , లలితాదేవికీ భేదము లేదు .
శ్యామలాదేవి నవరాత్రులు..
జనవరి 30న ప్రారంభమై ఫిబ్రవరి 07న ముగుస్తాయి..
వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..
శ్యామలాదేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడోశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి..వీలైన వారు మాతంగి యొక్క సోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగు వాటిని పారాయణం చేస్తూ పూజలు చేసుకోవాలి..ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేధించాలి.
రాజశ్యామల నవరాత్ర శుభ సందర్భం మాఘ శుద్ధ పాడ్యమి 30-01-2025 నుండి మాఘ శుద్ధ దశమి 07-02-2025 వరకు శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో సమీపిస్తున్న తరుణంలో, చాలా మంది భక్తులు, ఉపాసకులు పూజలు మరియు హోమాలకు విరాళాలు అందించాలనే కోరికను వ్యక్తం చేశారు. మీ భక్తి మరియు మద్దతును మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము.
దశమహావిద్యలలో మాతంగి విద్యగా ఈ తల్లి ప్రసిద్ధి. మతంగ ముని తపస్సు చేసి అమ్మవారిని మెప్పించాడు. అమ్మవారు శ్యామల దేవి ఆయనకు కుమార్తెగా అవతరించింది.
నీల శరీర ఛాయతో మెరిసిపోతూ ఉంటే ఈ తల్లికి నాలుగు చేతులతో ప్రసిద్ధి. కొన్ని చోట్ల ఎనిమిది చేతులతో కూడా మనము దర్శించవచ్చు. వీణాపాణిగా కనపడే ఈ తల్లి సరస్వతీమాతకు మరో రూపము. అమ్మవారు లలితా సహస్రంలో మంత్రిణి నామంలో పూజలందుకుంటుంది. ఈ తల్లి లలితాపరమభట్టారికకు మంత్రిణిగా ఉంటుంది. ఈమె గేయచక్ర రథంలో ఈమె ఉంటుంది. ఈ తల్లి యంత్రం ఏడు ఆవరణలతో కూడి ఉంటుంది.
ఈ తల్లిని ధ్యానిస్తే జ్ఞానమునిస్తుంది. సంగీతాన్ని సాధన చేసే వారు ఈ తల్లిని ఆరాధిస్తే వారికి సంగీతం వశమవుతుంది. కళలలో ప్రావీణ్యం పొందటానికి ఈ తల్లి సాధన ఉత్తమమైనది.
జీవితంలో కావలసిన వన్నీ ఈ తల్లిని సేవించి పొందవచ్చు.
సప్త స్వరాలలో “ని” సర్వం శబ్ధం ఏనుగు ఘీంకారంలో ఉంటుంది. ఏనుగును మతంగమంటారు. మాతంగ విద్య అంటే తారా స్థాయిలో ఉన్న సంగీత నాదం. అంటే బ్రహ్మవిద్యే. మాతంగిని దేవిని కొలవటమంటే బ్రహ్మ విద్యనే అని అర్థం.ఈ తల్లిని గురించి వేదాలలో ఉంది. ఉపనిషత్తులలో వివరించబడి ఉంది. ఈ తల్లిని సేవించటం వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. తదనంతరం మోక్షం కూడా సిద్ధిస్తుంది.
“మతం గచ్ఛతి ఇతి మతంగః” అంటే ఒక అభిప్రాయార్థమై వెళ్ళటమే మతంగం.
అవ్యక్త శబ్ధం వ్యక్తం కావటానికి ఆలోచించే మనస్సు దగ్గరకు వెళుతుంది. వాక్కు యొక్క ఈ దశనే మతం అంటారు. అంటే హృదయం నుంచి భావం వ్యక్తం కావటానికి వాక్కు మనస్సు దగ్గరకు వెడుతుంది. అపుడు మాతంగి అవుతుంది. పరా వాక్కు అవ్యక్తం. వైఖరి యే మాతంగం. (వాక్కు నాలుగు రూపాలుగా ఉంటుంది. అది పరా, ఫశ్యంతి, మధ్యమా, వైఖరి.)
అంటే వాక్కుకు తల్లి ఈమె. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులతో జ్ఞానశక్తి రాజ్యశ్యామల । ఈ తల్లిని సేవించిన వారికి ఆధ్యాత్మిక విద్యను మోక్షాన్ని ఇస్తుంది.
ఈమెకు పరివారము 16 మంది.
ఈ తల్లిని నీల సరస్వతి, గేయ చక్రవాసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ది మాతంగి, వ్యాస మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల పరివారమై ఒప్పుతున్నారు.
శ్యామలాదేవి, లలితదేవి ఆత్మగా ధ్యానించాలి. యోగదృష్టిలో చూస్తే హృదయ స్థానములో ఉన్న అనాహతము అమ్మవారి స్థానము. అమ్మవారు “ఐం” కారానికి ప్రతీక. ఈ ఐం అన్న ఒక్క మాటతో సిద్ధింపచేసుకున్న వారు చరిత్రలో ఉన్నారు.
ప్రపంచంలో కాళిదాసు చేసిన శ్యామల దండకము ప్రసిద్ధి. కాళిదాసు కథ అందరికీ తెలిసిందే. ఏమీ తెలియని వెర్రి వాడు కాళిదాసుగా మహా పండితుడుగా మారింది ఈ తల్లి దయ వలననే.
ఆయన చెప్పిన శ్యామల దండకం మంత్రమయం. ఈ దండకం అమ్మవారి ఉనికిని, రూపును, అటు పైన తత్త్వమును విశదపరుస్తుంది. ఆ దండకము సాధనచేసిన చాలు జ్ఞానము ప్రసాధిస్తుందీ తల్లీ.
శ్యామల దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు, కొత్త పదవులు ఉద్యోగాలలో ఉన్నతిని పొందుతారు. త్వరగా మంత్ర సిద్ధి పొందుతారు ఏదైనా చెడు ప్రయోగాలను రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా ఉంటుంది..
విరాళాల వివరాలు క్రింద ఉన్నాయి:వస్తువులు మరియు విరాళాలు
బాదం (5 కిలోలు)
ఎండుద్రాక్ష (5 కిలోలు)
జీడిపప్పు (5 కిలోలు)
అన్నదానం (ఆహారం అందించడం): రోజుకు ₹50,000
పూల దండలు మరియు పువ్వులు: రోజుకు ₹5,000
తామర పువ్వులు మరియు తమలపాకులు: రోజుకు ₹1,500
వట్టివేరు (10 కిలోలు): అభ్యర్థనపై అందుబాటులో ఉన్న విరాళాల వివరాలు మీరు ఈ వస్తువులను డెలివరీ చేయడానికి ఎంచుకోవచ్చు లేదా ద్రవ్య విరాళాలు ధన రూపంగా పంపవచ్చు. మీ భాగస్వామ్యం ఈ వేడుకల పవిత్రతను పెంచుతుంది మరియు మీ దయగల దాతృత్వానికి మేము కృతజ్ఞులం.
ద్రవ్య విరాళాల వివరాలు దయచేసి గమనించండి: లావాదేవీ రసీదుతో పాటు మీ పేరు మరియు పాన్ కార్డ్ నంబర్ లేదా మీ చిరునామాను (విదేశీ నివాసితుల కోసం) పంపండి. ఆడిట్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి.
డైరెక్ట్ డిపాజిట్ భారతదేశంలో లేదా ఇతర దేశాలలో భారతీయ బ్యాంక్ ఖాతా ఉన్నవారికి : శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, మేడిపల్లి బ్రాంచ్, హైదరాబాద్, కరెంట్ ఖాతా నంబర్: 108111100000256 IFSC కోడ్: UBIN0820661 ఈ దైవిక ప్రయత్నంలో మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.
దేవి ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబంపై ఉండుగాక ద్రవ్య విరాళాల వివరాలు దయచేసి గమనించండి: లావాదేవీ రసీదుతో పాటు మీ పేరు మరియు పాన్ కార్డ్ నంబర్ లేదా మీ చిరునామాను (విదేశీ నివాసితుల కోసం) పంపండి. ఆడిట్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి.
కార్యక్రమం వివరాలు * ఉదయం ఏడు గంటలకు గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవాచనం, నవగ్రహస్థాపన, రాజశ్యామల కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన, నవగ్రహ ఆవాహన, రాజశ్యామల యాగం, కూష్మాండబలి, పూర్ణాహుతి. * హోమగుండం వద్ద దంపతులు ప్రత్యక్షంగా యాగంలో పాల్గొనే అవకాశం. * శ్రీ చక్ర అర్చనలో మహిళలందరికీ అవకాశం. * దశ మహా విద్యలలో రాజశ్యామల యాగమునకు విశేషమైన ఫలితములు కలవు. రాజ్యాధికారం, సమాజంలో గౌరవము, సకల కార్యసిద్ధి జరుగును. * శ్రీ చక్ర అర్చన వలన లక్ష్మీ కటాక్షం మరియు ఆరోగ్యము ఆనందము కలుగును. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కాళరాత్రి, మహాగౌరీ, సిద్దిధాత్రి, దుర్గ, శ్యామల అష్టమాత్రుకల పూజ కార్యక్రమాలు హోమాలు జరుగును. బహుళపక్ష అష్టమి స్త్రీలతో కుంకుమార్చన, శ్రీ రాజశ్యామల మహాయాగం జరుగును.
* శ్రీ రాజశ్యామల యాగంలో పాల్గొనేవారు దంపతులకు 10,116/-రుసుము. శ్రీ చక్ర అర్చనలో పాల్గొనే స్త్రీలు 1116/- రుసుము. గోత్రనామాలతో చదివించుటకు 516/- రుసుము చెల్లించి రసీదు పొందగలరు. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ కలదు. ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్న సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును. కావున సదరు పై విషయములను మీకు తెలిసిన వారందరికీ పంపించి సహాయ సహకారములు అందించ మనవి.
ఇట్లు,
శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్








Reviews
There are no reviews yet.